దుబ్బాక: ఆస్తి తగాదాలతో సైనికుడు ఆత్మహత్యాయత్నం

2474చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో ఆదివారం ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆర్మీ సైనికుడు దొడ్ల అశోక్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయని, తన చావుతోనైనా సమాధానం దొరుకుతుందని సూసైడ్ నోట్ రాసి, సెల్ఫీ వీడియో తీసి, గుర్తు తెలియని మాత్రలు వేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.