దుబ్బాక: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

1చూసినవారు
దుబ్బాక: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని పోతారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆయన సూచించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్