దుబ్బాక: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి.

598చూసినవారు
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం దుబ్బాక నియోజకవర్గ పరిధి చేగుంట మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ మరియు కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ పాల్గొనడం శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి, జట్టుగా పనిచేసే నైపుణ్యాలకు ఎంతో ముఖ్యమని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్