సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తోందని ఆరోపించారు. జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు వంగరి నాగరాజు ఆధ్వర్యంలో డీలర్లు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా రేషన్ డీలర్లకు నెలకు రూ. 5 వేలు గౌరవ వేతనం, క్వింటాలుకు రూ. 300 కమీషన్ ఇవ్వాలని వారు కోరారు.