దుబ్బాక: కాశీకి వెళ్లొచ్చే లోపు ఇల్లు గుల్ల చేసిన దొంగలు

2184చూసినవారు
దుబ్బాక పట్టణంలో చింత రాజ్ కుమార్ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి లాకర్ పగులగొట్టి సుమారు కిలోన్నర బంగారం, 8 కిలోల వెండి, రూ. 8 లక్షల నగదును అపహరించారు. కుటుంబం కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ సాంకేతిక ఆధారాలతో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్