దుబ్బాక: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

843చూసినవారు
దుబ్బాక: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
దుబ్బాక పురపాలక చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత, కమిషనర్ మహేష్ కుమార్ తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని అర్హులైన నిరుపేదల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. రెండో విడతలో దుబ్బాక పురపాలికలోని 20 వార్డుల్లో 114 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, ఏవైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్