దుబ్బాక: బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటా

69చూసినవారు
దుబ్బాక: బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటా
పార్టీకి కార్యకర్తలు చేసిన సేవలు మరువలేనివని, వారికి ఎప్పుడూ అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు తోట్ల చంద్రయ్య గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకుని శుక్రవారం అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్