ఎన్నికల నియమావళి పాటించాలి: తహశీల్దార్

776చూసినవారు
దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో తహశీల్దార్ చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సాగేందుకు అధికారులు, రాజకీయ నాయకులు సమన్వయంతో ముందుకు రావాలని ఆయన సూచించారు. డబ్బు, మద్యం పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల వినియోగం, ప్రచార సమయాల విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. అధికార యంత్రాంగం పక్షపాతరహితంగా వ్యవహరిస్తుందని, ఫిర్యాదులుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్