
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఈయనే!
బంగారం, వెండి ధరలు రెండు రోజుల్లోనే భారీగా పడిపోయాయి. అయితే దీనికి ప్రధానం కారణం కెవిన్ వార్ష్ US సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్ కానుండటమే. ట్రంప్ ఈయనను నామినేట్ చేయడంతో మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్గా పనిచేసిన వార్ష్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా ఉంటారు. డాలర్ బలోపేతానికే పెద్దపీట వేస్తారన్న అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేపట్టడంతో ధరలు పతనమయ్యాయి.




