మితిమీరిన రసాయన ఎరువుల వాడకంతో నేల నిస్సారమవుతుంది

0చూసినవారు
మితిమీరిన రసాయన ఎరువుల వాడకంతో నేల నిస్సారమవుతుంది
తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. సీహెచ్. పల్లవి, దుబ్బాక మండలంలోని బల్వంతాపూర్ గ్రామంలో రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 'సమతుల్య ఎరువులు, నేల ఆధారిత ఎరువుల యాజమాన్యం'పై అవగాహన, శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ, మితిమీరిన రసాయన ఎరువుల వాడకంతో నేల నిస్సారమవుతుందని హెచ్చరించారు. అధిక దిగుబడులతో పాటు నేల సారాన్ని దీర్ఘకాలం రక్షించడానికి సమతుల్య ఎరువుల వినియోగం, నేల పరీక్ష ఆధారిత ఎరువుల సిఫార్సులు ఎంతో అవసరమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల వ్యవసాయాధికారిణి ప్రియదర్శిని కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్