జీలుగ, జనుము విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

0చూసినవారు
జీలుగ, జనుము విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట జిల్లా తొగుట మండలం కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో రైతులకు జీలుగ, జనుము సబ్సిడీ విత్తనాలను మంగళవారం ఏఎంసి మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి అందజేశారు. జీలుగ 1 కేజీ ధర రూ. 163.50, సబ్సిడీ రూ. 81.75, రైతు చెల్లించాల్సింది రూ. 81.75. జనుము 1 కేజీ ధర రూ. 155.50, సబ్సిడీ రూ. 77.75, రైతు చెల్లించాల్సింది రూ. 77.75. పచ్చి రొట్ట ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొంగరి నర్సింలు, సర్పంచ్ శోభ కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :