దుబ్బాక మండలం, అక్బర్ పేట్ భూంపల్లి X రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ, రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వారి కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వీరు ఎనగుర్తి గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదం సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.