ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం

0చూసినవారు
ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం
సిద్ధిపేట జిల్లా తోగుట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన గంగి చంద్రంకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ. 13,500 చెక్కును గాజులపల్లి గ్రామ సర్పంచ్ పంజ స్వామి అందజేశారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి సహకారంతో ఈ సహాయం అందింది. ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ మంచి చర్య అని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రేమ్ కుమార్, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్