సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో శనివారం ఇద్దరు యువకులు బంగారం, వెండి ఆభరణాలు మెరిసేలా కడిగిస్తామని చెప్పి మోసానికి పాల్పడ్డారు. అనూష బంగారు పుస్తెలతాడు, చెల్లెలు వెండి పట్టగొలుసులు శుభ్రం చేస్తామని తీసుకుని, పౌడర్ చల్లి మోసం చేశారు. తూకం వేయగా 8 గ్రాముల బంగారం తక్కువ కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొగుట పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు.