సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో 43 ఇండ్లు మంజూరు కాగా, కేవలం 15 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ గృహాలను మంచి నాణ్యతతో, వేగంగా నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి కలను నెరవేర్చుకోవాలని ఆయన తెలిపారు.