మహనీయులను స్మరించుకోవడం సమాజానికి ఎంతో అవసరము

చీకోడ్ గ్రామంలో ఈ నెల 30న నిర్వహించనున్న మహనీయుల ఉత్సవ సభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించిన మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్, దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మహనీయులను స్మరించుకోవడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. మహాత్మా జ్యోతి రావు పూలే సామాజిక విప్లవానికి నాంది పలికారని, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా పేదలు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించి సమానత్వానికి పునాది వేశారని పేర్కొన్నారు.
