
రూ.500 అప్పుతో రూ.11 కోట్లు గెలిచిన కూరగాయల వ్యాపారి!
రాజస్థాన్‌కు చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా, స్నేహితుడు ఇచ్చిన రూ.500 అప్పుతో కొన్న లాటరీ టికెట్‌తో రూ.11 కోట్లు గెలుచుకున్నాడు. 16 మంది సభ్యుల కుటుంబాన్ని పోషిస్తున్న సెహ్రాకు ఇది ఊహించని అదృష్టం. అక్టోబర్ 31న పంజాబ్ ప్రభుత్వం విజేతను ప్రకటించినప్పటికీ, సెహ్రాకు నమ్మడానికి సమయం పట్టింది. మొబైల్ ఫోన్ ఉపయోగించని ఆయన, మొదట వార్తలను అబద్ధాలుగా కొట్టిపారేశాడు. తన స్నేహితుడు ముకేశ్‌కు కృతజ్ఞతగా రూ.1 లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.




