యువ న్యాయవాదిపై దాడికి నిరసనగా న్యాయవాదుల విధుల బహిష్కరణ

5చూసినవారు
యువ న్యాయవాదిపై దాడికి నిరసనగా న్యాయవాదుల విధుల బహిష్కరణ
మొయినాబాద్ శివారులోని కేతుపల్లి గ్రామంలో యువ న్యాయవాది స్వప్నపై జరిగిన దాడిని నిరసిస్తూ, దుబ్బాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ సెక్రెటరీ చిటుకుల అశోక్ మాట్లాడుతూ, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులపై భవిష్యత్తులో దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్