
మిథాలీరాజ్ రికార్డ్ సమం చేసిన హర్మన్ ప్రీత్ కౌర్
శ్రీలంకతో మంగళవారం జరిగిన అయిదో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుని, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. ఈ మ్యాచ్‌లో 68 పరుగులు చేసిన హర్మన్, టీమ్ఇండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో భారత జట్టు 5-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. హర్మన్ తన 187వ టీ20 మ్యాచ్‌లో 12వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా, మిథాలీ తన కెరీర్లో 89 మ్యాచ్‌లలో 12 సార్లు ఈ ఘనత సాధించింది.




