మిరుదొడ్డి: వడదెబ్బతో రైతు మృతి

0చూసినవారు
మిరుదొడ్డి: వడదెబ్బతో రైతు మృతి
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందే గ్రామంలో వడదెబ్బతో ఓ రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన బయ్యారం కిష్టారెడ్డి, ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో వారంరోజులుగా ధాన్యం కుప్ప వద్దే ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు అతన్ని సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్