సిద్ధిపేట జిల్లా దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు శనివారం విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దుబ్బాకతో పాటు మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయ పోల్, భూంపల్లి- అక్బర్పేట మండలాలతో కలిపి రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయాలన్నారు.