పోషణ మాసం: అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం

564చూసినవారు
దౌల్తాబాద్‌లోని ఇందుప్రియాల్‌ అంగన్వాడీ కేంద్రంలో దుబ్బాక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ మాసం షెడ్యూల్‌లో భాగంగా అవగాహన కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్‌ 17 నుండి అక్టోబర్‌ 16 వరకు పౌష్టికాహారం, జంక్‌ ఫుడ్‌ నివారణ, అధిక బరువు నియంత్రణ, అన్నప్రాసన వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు సీడీపీఓ ఎలయ్య తెలిపారు. స్థానికంగా లభ్యమయ్యే పౌష్టికాహార వినియోగాన్ని ప్రోత్సహించాలని, ఆరోగ్యలక్ష్మి పథకం సేవలను గర్భిణీలు, బాలింతలు వినియోగించుకోవాలని సూచించారు. పోషకాహారం ప్రాముఖ్యత, చిరుధాన్యాల ప్రయోజనాలను వివరించారు. గర్భిణీ, బాలింతలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సలహాలు అందించారు. పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి, పోషణ లోపం లేని తెలంగాణ కోసం ప్రతిజ్ఞ చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, లబ్ధిదారులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్