సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో ఆగ్రోస్-1, ఆగ్రోస్ 2 లో పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగించే జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దౌల్తాబాద్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు జీలుగు, జనుము విత్తనాలను పంపిణీ చేశారు. వ్యవసాయ భూములలో నేల సారాన్ని పెంచడం, సాగు ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అధిక మొత్తంలో రసాయన ఎరువులను వినియోగించడం వల్ల భూముల భూసారం క్రమంగా తగ్గిపోతుందని పేర్కొన్నారు.