సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం చిన్న మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీశాంత్ ముదిరాజ్ భారత ఆర్మీలో సోల్జర్‌గా ఎంపికయ్యాడు. గజ్వేల్‌లోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన శ్రీశాంత్ తన కృషితో ఈ విజయం సాధించాడు. రాయపోల్ మండలం నుంచి ఆర్మీలో చేరిన 9 మందిలో 8 మంది ఈ అకాడమీ నుంచే ఎంపిక కావడం విశేషం. గ్రామీణ యువతకు నాణ్యమైన శిక్షణ అందించి దేశ సేవకు అవకాశం కల్పిస్తున్నామని అకాడమీ నిర్వాహకులు తెలిపారు.