రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం ఆప్తులను కోల్పోయిన పలువురు కుటుంబీకులను పరామర్శించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని ధర్మారం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తండ్రీకొడుకులు చల్మెడ కుమారస్వామి కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపి, ఓదార్చారు. అనంతరం, అదే గ్రామానికి చెందిన మిడిదొడ్డి చంద్రం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కూడా వెంకటయ్య పరామర్శించారు.