సిద్దిపేట: బొలేరో, బైక్ ఢీ కొని ఒకరికి తీవ్ర గాయాలు

535చూసినవారు
సిద్దిపేట: బొలేరో, బైక్ ఢీ కొని ఒకరికి తీవ్ర గాయాలు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని లచ్చపేట- దర్మాజీపేట- రామక్కపేట చౌరస్తా వద్ద కామారెడ్డి నుండి టేస్టీ గోల్డ్ ఆయిల్ సరఫరా చేసే వ్యాను శుక్రవారం దుబ్బాక వైపు వెళ్ళుతుంది. అదే సమయంలో దర్మాజిపేట నుండి రామక్కపేట వెళుతున్న ద్విచక్ర వాహనం పై ఉన్న రామక్కపేట గ్రామానికి చెందిన ఎల్లంను లచ్చపేట- దర్మాజీపేట- రామక్క పేట చౌరస్తా వద్ద వ్యాను ఢీ కొట్టింది. ఎల్లంకు తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం నుజ్జు నుజ్జు కాగా, వ్యాను రోడ్డు పక్కనే వున్న పొలంలోకి పల్టీ కొట్టింది.

సంబంధిత పోస్ట్