నిరుపేద యువతి వివాహానికి పుస్తెమెట్టెలతో శ్రీనివాస్ యాదవ్ మానవత్వం

485చూసినవారు
నిరుపేద యువతి వివాహానికి పుస్తెమెట్టెలతో శ్రీనివాస్ యాదవ్ మానవత్వం
దుబ్బాక మున్సిపాలిటి పరిధిలోని చెల్లాపుర్ రెండవ వార్డుకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బుస్సబోయిన దీక్షిత వివాహానికి పోన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ పుస్తెమెట్టెలు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి తన వంతు సహకారంగా నిలువలని పుస్తి మెట్టెలు అందజేశారు. ఎన్ని ఆస్తులు డబ్బులు సంపాదించిన సంతోషం కలుగని నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడంలో ఏంతో సంతోషం కలుగుతుందని, కష్టాల్లో వున్న వారికీ తన వంతు సహాయం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందు ముదిరాజ్, బాబు, ఆకుల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్