లిఫ్ట్ ఇచ్చి చైన్ స్నాచింగ్ చేసిన నిందితుడు అరెస్ట్

1చూసినవారు
లిఫ్ట్ ఇచ్చి చైన్ స్నాచింగ్ చేసిన నిందితుడు అరెస్ట్
తొగుట సీఐ లతీఫ్ తెలిపిన వివరాల ప్రకారం, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గత నెల 26న సాయంత్రం దీపాయంపల్లికి చెందిన ఓ మహిళ దౌల్తాబాద్ లో ఆటో కోసం ఎదురుచూస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి మోటార్ సైకిల్ పై లిఫ్ట్ ఇచ్చి, గొడుగుపల్లికి వెళ్తున్నానని చెప్పాడు. దౌల్తాబాద్ నుంచి దీపాయంపల్లి శివారులోకి రాగానే, మహిళ మెడలో ఉన్న 3 తులాల బంగారు తాడు, 2 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 20 తులాల వెండి కాళ్ల పట్టీలను లాక్కొని పరారయ్యాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్