గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిధులు ఢిల్లీ నుంచే వస్తాయని తెలిపారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని బాలాజీ ఆలయంలో వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న ఆయన, రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అంతకుముందు మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు.
