విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యము

9చూసినవారు
విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యము
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని హబ్సీపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న అన్నం, గుడ్డు, పాలకూర పప్పు, ఆలుగడ్డ టమాటా కూరలను పరిశీలించారు. మెనూ పాటిస్తున్నప్పటికీ, కూరలు అన్ని పాఠశాలల్లోనూ సాంబారులా పలచగా ఉండటంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విధులు సరిగ్గా నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్