తోగుట: మల్లన్న దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే

0చూసినవారు
తోగుట: మల్లన్న దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే
సిద్ధిపేట జిల్లా తోగుట మండలంలోని జప్తిలింగారెడ్డి పల్లిలో వెలసిన సింగరాల మల్లన్న ఆశీస్సులతో ప్రజలంతా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సస్యశ్యామలంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం సింగరాల మల్లన్న దేవాలయంలో జరిగిన జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, స్వామివారి దయతో ఈ సంవత్సరం పుష్కలంగా కాలమైందని, యాసంగిలో కూడా పెద్ద ఎత్తున పంటలు పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :