మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ, కష్ట కాలంలో ఉన్నవారికి అండగా నిలిస్తే దైవం బలం కూడా తోడుంటుందని అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కుడి చేతిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఈదుగాళ్ల స్వామి కుటుంబానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిట్ల వెంకట్, పాత్కూల బాలేష్, ఉప సర్పంచ్ లచోళ్ల లింగం, బీఆర్ఎస్ యువకులు రూ. 10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మానవ సేవయే మాధవ సేవ అని పేర్కొన్నారు.