
అమెరికా సైనికులు షార్కులకు ఆహారంగా మారతారు: ఇరాన్
ఇరాన్‌పై యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు అమెరికా 3,500 మంది సైనికులను పశ్చిమాసియాకు తరలించింది. అధునాతన యుద్ధనౌక యూఎస్ఎస్ ట్రిపోలి ద్వారా సైనికులు గల్ఫ్ తీరానికి చేరుకున్నారు. అయితే, అమెరికన్ సైనికుల రాకపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దీవుల్ని, నేలను ఆక్రమించాలని చూస్తే అమెరికన్ సైనికులంతా అక్కడి పర్షియన్ గల్ఫ్ షార్కులకు ఆహారంగా మారడం ఖాయమని ఇరాన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది.




