కూడవెల్లి వాగులోకి నీరు విడుదల చేయాలి: సర్పంచ్

0చూసినవారు
కూడవెల్లి వాగులోకి నీరు విడుదల చేయాలి: సర్పంచ్
సిద్దిపేట జిల్లా, దుబ్బాకలో కూడవెల్లి వాగులో నీరు లేకపోవడంతో పంటలకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాగులోకి నీటిని విడుదల చేయాలని బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి ఆలస్యం చేయకుండా మల్లన్న సాగర్ డ్యాం నుంచి తక్షణమే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. లేదంటే రైతులతో కలిసి అక్బర్ పేట జాతీయ రహదారిని నిర్భందిస్తామని హెచ్చరించారు. ఈ సంఘటన ఫిబ్రవరి 5, 2026న జరిగింది.
Job Suitcase

Jobs near you