సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తల్లి సంగోజి పల్లవి బిడ్డకు జన్మనిచ్చి, పుట్టినప్పుడు మరణించింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే తండ్రి శంభోజి వెంకటస్వామి కూడా అనారోగ్యంతో మరణించారు. దీంతో అనాథలైన పిల్లలు నానమ్మ సంరక్షణలో ఉన్నారు. నానమ్మకు కూడా సరైన ఆదాయం లేకపోవడంతో పిల్లల పోషణ భారంగా మారింది. స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, చుట్టుపక్కల వారు కోరుతున్నారు.