
దుబ్బాక: టీ -20 టీంకు పెద్ద గుండవెల్లి యువతి
సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన దొడ్ల మంజుల, రవీందర్ దంపతుల కుమార్తె ప్రాంజల్, క్రికెట్ అంటే తెలియని తల్లిదండ్రులకు ఆ క్రీడను పరిచయం చేసింది. దినసరి కూలి కుటుంబానికి చెందిన ఈ యువతి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంపికలలో తన ప్రతిభను చాటి టీ20 జట్టుకు ఎంపికైంది. తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటానని ప్రాంజల్ ధీమా వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు.




































