
తెలంగాణ నుంచి లచ్చపేట మోడల్ స్కూల్ ఎంపికవడం సంతోషం
ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రయాస్-2025 పోటీలకు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మెడల్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఎస్సీఆర్టీ -న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఏటా ఈ పోటీలు జరుగుతాయి. తెలంగాణ నుంచి ప్రభుత్వ పాఠశాలల విభాగంలో కేవలం లచ్చపేట మోడల్ స్కూల్ ఎంపిక కావడం విశేషం. ఎంఈఓ జోగు ప్రభుదాస్ ఈ విషయాన్ని తెలిపారు.







































