Dec 16, 2025, 14:12 IST/గజ్వేల్
గజ్వేల్
దిలాల్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు, గిరి ప్రదక్షిణ
Dec 16, 2025, 14:12 IST
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామంలోని స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు, గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ, 42వ నెల భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ జరిగిందని, దీనివల్ల సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, అనారోగ్య సమస్యలు దరిచేరవని, స్వామివారిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, నాయకులు, అయ్యప్ప స్వాములు, చిన్నారులు, మహిళలు, గ్రామస్థులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.