Mar 31, 2026, 17:03 IST/
ఈ జిల్లాల్లో వడగళ్ల వర్షం.. ALERT
Mar 31, 2026, 17:03 IST
TG: రాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఈ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షం సమయంలో గంటకు 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.