గజ్వేల్ మండలం - Gajwel Mandal

సిద్దిపేట జిల్లా
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు
Apr 18, 2026, 15:04 IST/సిద్దిపేట
సిద్దిపేట

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

Apr 18, 2026, 15:04 IST
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో వీగిపోయేలా చేసిన విపక్షాలకు వ్యతిరేకంగా శనివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు బుడిగే బాలమణి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ బొమ్మ చౌరస్తా వద్ద కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బిల్లు ఆమోదం పొందకుండా రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు అడ్డుకున్నారని, తద్వారా మహిళలకు అన్యాయం చేశారని ఆరోపించారు.