గజ్వెల్ పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 12 మందిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో తొమ్మిది మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 91,500 రూపాయల జరిమానా విధించారు. ఒక వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష, మరో ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్షతో పాటు 1500 రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మురళి మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు.