సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామ కోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు, అలనాటి అరుదైన చిన్న పది పైసల నాణాలు, 1988 నాటి నాణేలను ఉపయోగించి ఆంగ్ల సంవత్సరం 2026 సంఖ్యను అద్భుతంగా చిత్రించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తమ వృత్తిలో ఉన్నత శిఖరాలకు ఎదిగి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.