పేదలు కడుపు నిండా అన్నం తినేలా ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని చేపట్టిందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలోని దర్గా గ్రామంలో రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పొందిన లబ్దిదారుడి ఇంట్లో శుక్రవారం భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెలా రేషన్ దుకాణాల ద్వారా 5, 775 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అందిస్తున్నామన్నారు.