సిద్ధిపేట: 'సీజనల్ వ్యాధులకు సంబంధించి అన్ని సదుపాయాలు ఉంచుకోవాలి'

63చూసినవారు
సిద్ధిపేట: 'సీజనల్ వ్యాధులకు సంబంధించి అన్ని సదుపాయాలు ఉంచుకోవాలి'
సిద్ధిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం పలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా తీగుల్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనికి చేశారు. వైద్యం విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, సీజనల్ వ్యాధులకు సంబంధించి అన్ని సదుపాయాలు పిహేచ్సి లో ఉంచుకోవాలని తెలిపారు. తరచూ పిహెచ్సిని మండల అధికారులు పర్యటించి రోగులకు అందించే సేవలను తనిఖీ చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్