సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం వేద పండితులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్
రాజమౌళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు. దేవాలయం తరపున వారిని దేవాలయ అధ్యక్షులు తలకొక్కుల లక్ష్మణ్, పద్మశాలి సంఘం పట్టణ మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.