ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, సరదా కోసం వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దని గజ్వేల్ ఏసీపీ నర్సింలు అన్నారు. కొండపోచమ్మ సాగర్ పరిసర ప్రాంతాలను ఏసీపీ సందర్శించారు. ప్రాజెక్టుల వద్దకు వెళ్లి లోతు తెలియకుండా ఫోటోల కోసం సెల్ఫీల కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దని, మీ పిల్లలు జాగ్రత్త, పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి, పిల్లల బాధ్యత తల్లిదండ్రులదేనని సూచించారు.