భద్రాచలం కార్తీక మాసం పూజల కరపత్రం ఆవిష్కరణ

0చూసినవారు
భద్రాచలం కార్తీక మాసం పూజల కరపత్రం ఆవిష్కరణ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసిపి నర్సింలు చేతుల మీదుగా భద్రాచలం దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించే కార్తీక మాసం పూజల కరపత్రాలను రామకోటి రామరాజు ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే కార్తీక మాస ప్రత్యేక పూజల్లో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బలరాం, శ్రీనివాస్, సబ్బని నరేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్