
కెనడాలో మరో భారతీయుడిపై దాడి.. వీడియో వైరల్
కెనడాలో వలసదారులపై జాత్యహంకార దాడులు పెరుగుతున్నాయి. టొరంటోలోని ఒక మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లో భారత సంతతికి చెందిన వ్యక్తిపై శ్వేతజాతీయుడు అకారణంగా దాడి చేశాడు. నవంబర్ 1న జరిగిన ఈ ఘటనలో, మద్యం మత్తులో ఉన్న వ్యక్తి బాధితుడిని నెట్టివేసి, అతని ఫోన్ను కింద పడేలా చేశాడు. బాధితుడు ప్రశాంతంగా తన ఫోన్ను తీసుకుంటుండగా, దాడి చేసిన వ్యక్తి మరింత రెచ్చిపోయి అతని కాలర్ పట్టుకుని వెనక్కి నెట్టాడు. రెస్టారెంట్ సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణిగింది.




