పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం

159చూసినవారు
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటిదని ముద్దాపూర్ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం ముద్దాపూర్ గ్రామానికి చెందిన రిప్పల కరుణాకర్ కి రూ.15000, వెంకట్ రెడ్డికి రూ.17500, పొగుల ధనంజయ్యకు రూ. 10500, సత్తయ్యకు రూ. 18000, పుష్పమ్మకు రూ. 44000 సీఎం సహాయ నిధి నుండి మంజురైన చెక్కులను బుధవారం సర్పంచ్ శ్రీకాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేష్, వార్డ్ సభ్యులు, కవిత, కనకయ్య, ఆంజనేయులు, కరుణాకర్, గణేష్, ప్రశాంత్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్