గజ్వేల్‌లో నవ వధువుకు కౌన్సిలర్ దంపతుల పుస్తె మట్టెలు అందజేత

2చూసినవారు
గజ్వేల్‌లో నవ వధువుకు కౌన్సిలర్ దంపతుల పుస్తె మట్టెలు అందజేత
సిద్దిపేట జిల్లా గజ్వేల్ 2వ వార్డు కౌన్సిలర్ గోలి మమతా సంతోష్ ఆదివారం లింగారెడ్డిపల్లి గ్రామంలో నవ వధువు సత్యలక్ష్మికి పుస్తె మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ తోట శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజ సేవలో ముందుండే గోలి మమత సంతోష్ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్